
అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్నీ ఎన్నికల్లో తమకు సంఖ్యాబలం ఉంది కాబట్టే ఏడుగుర్ని పోటీలో పెట్టామన్నారు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. డబ్బులు ఎర చూపడం వల్లే టీడీపీ ఒక స్థానంలో గెలిచిందని, డబ్బులు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొన్నారని ఆయన పేర్కొన్నారు.
గతంలోనూ అలాగే టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా అదే చేశారన్నారు. టీడీపీ వాళ్లు ఎవరినో కొనుగోలు చేసినట్లు ఉన్నారని కౌంటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడి సజ్జల పేర్కొన్నారు. ఈ ఒక్క గెలుపు చూసుకుని తాము ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.