ఎన్నికల్లో పోటీపై మాజీ ఎంపీ పొంగులేటి సంచలన కామెంట్స్‌.. 

Ponguleti Srinivasa Reddy Sensational Comments On TS Politics - Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల్లోనూ విబేధాలు ఒకానొక దశలో బహిర్గతమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో బీఆర్‌ఎస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా, మాజీ ఎంపీ పొంగులేటి ఆదివారం నూతర సంవత్సర వేడుకల సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, పొంగులేటి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. గత నాలుగేళ్లలో ఏం జరిగిందో చూశాము. నా అనుచరులంతా ఎన్నికల్లో పోటీ చేస్తారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్నాము. బీఆర్‌ఎస్‌లో నాకు దక్కిన గౌరవం ఏంటో మీకు తెలుసు. అనుచరులతో భేటీకి ఇది రాజకీయ వేదిక కాదు. భవిష్యత్‌లో అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. పోటీచేసే అర్హత ఉన్న అందరూ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top