కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం: పేర్ని నాని

Perni Nani Interesting Comments On KCR Statement About Start Party In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్లపై మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు.. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే పోలా అని చమత్కరించారు. కేసీఆర్ పార్టీ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్నారు పేర్ని నాని.
(చదవండి: వారికి ఎవరి రికమండేషన్‌ అవసరం లేదు: పేర్ని నాని)

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘‘ఏపీలో పార్టీ పెట్టడానికంటే ముందు కేసీఆర్‌ తెలంగాణ కేబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపేయాలనే తీర్మానాన్నిపెడితే బాగుంటుంది. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఏపీ, తెలంగాణలు ఒకటే రాష్ట్రంగా ఉండాలని జగన్ గతంలోనే కోరుకున్నారు’’ అన్నారు. 
(చదవండి: అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి: పేర్ని నాని

‘‘ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఎలాంటి బలవంతం లేదు. ఐచ్చికంగానే వారు తమ నిర్ణయం తీసుకోవచ్చు. ఏపీలో గంజాయి గురించి కేబినెట్లోనే చర్చించామని 2017లోనే అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.  పవన్ కళ్యాణ్ కూడా 2018లోనే గంజాయి సాగవుతోందని ట్వీట్ చేశారు’’ అని పేర్ని నాని తెలిపారు.

చదవండి: టమ టమ బండి.. భలే భలేగా ఉందండి.! ఎర్రబాబు బండికి యమ క్రేజ్..!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top