చంద్రబాబుపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుటుంబం ఆగ్రహం | Mla Koneti Adimulam Son Suman Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుటుంబం ఆగ్రహం

Apr 16 2026 1:20 PM | Updated on Apr 16 2026 3:07 PM

Mla Koneti Adimulam Son Suman Fires On Chandrababu

సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రబాబు, నారా లోకేష్‌పై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మేము ఖర్చు చేసింది వెనక్కి ఇస్తే మా నాన్న రాజీనామా చేస్తారన్న సుమన్‌.. రాష్ట్రంలో దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు ఒక న్యాయమా? అంటూ నిలదీశారు. సత్యవేడు నియోజకవర్గానికి గంగా ప్రసాద్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించాలి. మేము ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును గంగా ప్రసాద్ దగ్గర జమ చేస్తే ఎమ్మెల్యే పదవికి మా నాన్న రాజీనామా చేస్తారు. గౌరవం లేని ఈ పదవి మాకు ఎందుకు..?’’ అంటూ సుమన్‌ ధ్వజమెత్తారు.

‘‘చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను సూటిగా అడుగుతున్నాం. మా డబ్బులు మాకు ఇచ్చేస్తే వెంటనే పదవికి రాజీనామా చేస్తాం. తిరుపతిలో ఎమ్మెల్యే ఎన్నికలకు కూటమి ప్రభుత్వం అభ్యర్థి రూ.100 కోట్లు ఖర్చు చేశారు. సత్యవేడు నియోజకవర్గం నుంచి అక్రమంగా ప్రతిరోజు గ్రావెల్, సాండ్ లారీల్లో తమిళనాడు తరలిపోతోంది. పిచ్చాటూరు నుంచి రోజుకి 50 నుంచి 60 ఇసుక ట్రాక్టర్లలో తమిళనాడు తరలిపోతోంది. స్థానిక సీఐ ఒక రాజకీయ నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారు.

..ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంబేద్కర్ జయంతి రోజు మంత్రి నారా లోకేష్ తిరుపతికి వచ్చినప్పుడు ఒక్క బ్యానర్‌లో కూడా అంబేద్కర్ ఫోటో కనిపించలేదు. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గంలో కోఆర్డినేటర్‌గా పెట్టడానికి ఒక దళితుడు మీకు కనిపించలేదా? దళితులు అంటే మీకు అంత చులకన. రాజ్యాంగం మీరు ఎక్కడ అమలు చేస్తున్నారు అంటూ కోనేటి సుమన్‌ సూటిగా ప్రశ్నించారు.

ఖర్చు వెనక్కిస్తే...ఎమ్మెల్యే పదవికి రాజీనామా! హాట్ కామెంట్స్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement