
''మనకు పనికిమాలిన ప్రభుత్వం అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇదే జరుగుతుంది
సాక్షి, హైదరాబాద్: ''మనకు పనికిమాలిన ప్రభుత్వం అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇదే జరుగుతుంది'' అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్, చందానగర్ చుట్టుపక్కల వాసులకు ఉపశమనం కలిగించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గోపన్‌పల్లి ఫ్లైఓవర్ కొన్ని నెలల క్రితం పూర్తయింది. కానీ నేటికీ, ఇది ప్రారంభోత్సవం కోసం వేచి ఉంది, ఎందుకంటే ఢిల్లీలోని ఉన్నతాధికారులు, బీఆర్‌ఎస్ శాసనసభ్యుల ఇళ్ల మధ్య సీఎం బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కంటే తమ వ్యక్తిగత ప్రజాప్రతినిధులే ముఖ్యమని భావిస్తోంది'' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
సంబంధిత అధికారులు తక్షణమే ఈ ఫ్లై ఓవర్‌ను ప్రజల ఉపయోగం కోసం తెరవాలని నేను కోరుతున్నాను.. లేదంటే ప్రజలు స్వయంగా దానిని ప్రారంభిస్తారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.