
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం చేసిన ఓ ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ నిర్బంధాలు, అడ్డంకులు, అరెస్ట్‌లను అధిగమించి లక్షలాది మందితో నిర్వహించిన మిలియన్‌మార్చ్‌కు పన్నెండేళ్లు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఆ ఘట్టం నేటికీ నా కళ్లలో మెదులుతూనే ఉంది’ అని కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు.
‘కేసీఆర్ నియంతృత్వ పాలనలో మిలియన్‌మార్చ్‌కు, అందులో పాల్గొన్న వారికి కనీస గుర్తింపు కరువైంది. కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ‘మార్చ్’కు కారణమైన నేతలు, ఉద్యమంలో అసువులుబాసిన అమరులు, విమోచన దినోత్సవానికి గుర్తింపు లేదు. ప్రజల ఆకాంక్షలను నీరుగార్చేలా, తెలంగాణ ప్రజల కళ్లలో కడగండ్లు మిగిల్చేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆడబిడ్డలకు రక్షణలేదు. కేసీఆర్ పాలనలో ఇదీ రాష్ట్ర దౌర్భగ్యస్థితి’ అని కిషన్‌రెడ్డి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
పనికొచ్చే పనులు చేయండంటూ కేటీఆర్ ట్వీట్
‘తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పండి చూద్దా’మంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. ‘తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు’ అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోదీ, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కాదంటూ కిషన్‌రెడ్డి ట్వీట్‌కు బదులిచ్చారు. మోదీ వ్యాక్సిన్ కనిపెట్టిండనే ఫేకుడు మాటలు మాని పనికొచ్చే పనులు చేయండంటూ హితవు పలికారు.
తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయిన MLA ఎవరో చెప్పుకోండి చూద్దాం?
— KTR (@KTRBRS) March 11, 2023
తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు
మోడీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని… https://t.co/7JzGrxnpgw