తెలంగాణలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు.. కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Komatireddy Raj Gopal Reddy Interesting Comments On Assembly Elections - Sakshi

సాక్షి, నిర్మల్‌: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భారీ ప్లాన్స్‌తో ముందుకుసాగుతోంది. ఈ క్రమంలోనే వివిధ పార్టీల్లోనే ఉన్న నేతలకు గాలం వేస్తూనే, ప్రతీ నియోజకవర్గంలో కీలక నేతలపై ఫోకస్‌ పెట్టింది. 

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ పాదయాత్ర కోసం నిర్మల్‌ వెళ్లిన కోమటిరెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటకతో పాటు తెలంగాణలో​ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ​ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు. 

ముందుస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. అలాగే, ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిచిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top