‘విభజన హామీల సాధనలో టీడీపీ విఫలం’ | Gudivada Amarnath Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

‘విభజన హామీల సాధనలో టీడీపీ విఫలం’

May 8 2026 9:08 PM | Updated on May 8 2026 9:13 PM

Gudivada Amarnath Fires On Chandrababu Government

సాక్షి, విశాఖపట్నం: విభజన హామీలు అమలు చేయమని వైఎస్సార్‌సీపీ అనేక పోరాటాలు చేసిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రత్యేక హోదా రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని... ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వం విభజన హామీలు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు తన ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వైఎస్‌ జగన్ ఆదేశాలు మేరకు 2016లో ఆమరణ నిరాహార దీక్ష చేశాను’’ అని ఆయన గుర్తు చేశారు.

‘‘నా మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆత్మహత్యా యత్నం కేసు నమోదు చేయించింది. ఆ కేసులో 6 నెలల జైలు శిక్ష, ఐదు వేలు జరిమానా విధించింది. ఆ కేసు కొట్టివేయాలని చేయాలని హయ్యర్ కోర్టులో అప్పీల్ చేశాము.. వాల్తేర్ డివిజన్‌తో కూడిన విశాఖ రైల్వే స్టేషన్ కావాలి. ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకు అప్పగించారు. రాష్ట్ర నాయకుల చేతగానితనం వలన కేకే లైన్ ఒడిశాకు పోయింది. విశాఖ వచ్చిన రైల్వే శాఖ మంత్రిని కేకే లైన్ గురించి ఎందుకు అడగలేదు.?. రైల్వే జోన్ గురించి ఎంపీ భరత్‌కు ఏం తెలుసు? విశాఖ రైల్వే జోన్‌కు ఆదాయం లేకపోయినా పర్వాలేదని ఎలా మాట్లాడతారు?’’ అంటూ అమర్నాథ్‌ నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement