‘నాలుగు శవాలు దొరికితే రాజకీయం చేయాలనుకున్నారు’ | Ex Minister Kodali Nani Comments On Chandrababu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘నాలుగు శవాలు దొరికితే రాజకీయం చేయాలనుకున్నారు’

May 26 2022 8:33 PM | Updated on May 27 2022 7:02 AM

Ex Minister Kodali Nani Comments On Chandrababu And Pawan Kalyan - Sakshi

ఫైల్‌ఫోటో

పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టి పవన్‌ కల్యాణ్‌ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.

సాక్షి, పల్నాడు జిల్లా: పవన్‌ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువతను రెచ్చగొట్టి పవన్‌ కల్యాణ్‌ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. రాజ్యాంగంపై అవగాహన లేనివారు రాజకీయాల్లోకి వస్తే ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్‌ను వ్యతిరేకించేవాళ్లను దేశం నుంచి బహిష్కరించాలని కొడాలి నాని డిమాండ్‌ చేశారు.
చదవండి: అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర: మంత్రి బొత్స

కోనసీమ ఘటన చాలా దారుణం. అమలాపురం ఘటన వెనుక ఎవరున్నారో తెలుసు.. కాల్పులు, లాఠీచార్జ్‌ జరగాలని కోరుకున్నారు. నాలుగు శవాలు దొరికితే రాజకీయం చేయాలనుకున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఘర్షణలకు తెరలేపాయి. పవన్ కల్యాణ్‌ అసత్యాలు పలకడంలో డిగ్రీ తీసుకున్నాడు. అధికారం కోసం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నాడని’’ కొడాలి నాని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement