ఏపీ ప్రభుత్వ ఓటీఎస్ విధానం మంచిదే: సీపీఐ నారాయణ | CPI Narayana Takes On PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ ఓటీఎస్ విధానం మంచిదే: సీపీఐ నారాయణ

Jan 8 2022 2:13 PM | Updated on Jan 8 2022 2:38 PM

CPI Narayana Takes On PM Narendra Modi - Sakshi

తిరుపతి: పంజాబ్‌ రైతుల నిరసనపై ప్రధాని మోదీ కొత్త నాటకానికి తెరతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తననను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని నరేంద్ర మోదీ సానుభూతి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నటనలో నేచురల్‌ స్టార్‌ నానిని నరేంద్ర మోదీ మించిపోయారన్నారు.

‘చైనా దురాక్రమణ పై ఇప్పటి ఇరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్లో అంతర్గత లోటుపాట్లు సరిదిద్దు కోకపోతే ఆపార్టీకి భవిష్యత్తు ఉండదు. తెలంగాణలో బీజేపీ నేతల అరెస్టు ద్వారా ఆ పార్టీని కేసీఆర్ మరింత బలోపేతం చేస్తున్నారు. అధికార పార్టీ చర్యలు తోనే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. జనసేన పొత్తులపై చంద్రబాబు చేసిన రాజకీయ చంచలత్వానికి నిదర్శనం. పొత్తులపై చంద్రబాబుకు క్లారిటీ లేకపోతే టీడీపీ వచ్చే ఎన్నికల్లోనూ ఇబ్బందులు తప్పవు. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటే మా నిర్ణయం మేము తీసుకుంటాము. ఏపీ ప్రభుత్వ ఓటీఎస్ విధానం మంచిదే.. ఇళ్లకు రేటు పెరుగుతుంది.  సీఎం జగన్ సంక్షేమ పథకాల అమలు బాగుంది’ అని నారాయణ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement