‘కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది’ | Bandi Sanjay Slams On KCR Over Dalita Bandu At Jan Ashirwad Yatra | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది’

Aug 21 2021 7:29 PM | Updated on Aug 21 2021 7:33 PM

Bandi Sanjay Slams On KCR Over Dalita Bandu At Jan Ashirwad Yatra - Sakshi

సాక్షి, హైదారబాద్‌: ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ పనిచేస్తారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీతాఫలమండి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ‘జన ఆశీర్వాద యాత్ర’ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పేరుతో పేరుతో మరోసారి దళితులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.

చదవండి: ‘దేశానికి మంత్రినైనా అంబర్‌పేటకు ముద్దు బిడ్డనే’

సీఎం కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కేసీఆర్‌ పాలన గాలికొదిలేశారని, కరోనా సమయంలో బీజేపీ మాత్రమే ప్రజలకు అండగా ఉందని బండి సంజయ్‌ తెలిపారు. ఈ యాత్రలో బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్య పాల్గొన్నారు.
చదవండి: గెలుపు ఖాయం, మెజారిటీపైనే దృష్టి పెట్టండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement