బస్తీ మే సవాల్.. దమ్ముంటే కేసులు పెట్టు.. కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్

Bandi Sanjay.. తెలంగాణ పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతోంది. నేడు ఒక పార్టీలో ఉన్న నేత మరుసటి రోజు ఏ పార్టీలో చేరుతున్నారో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిరోజుల కిత్రం కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. హస్తానికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
కాగా, తాజాగా సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. బండి సంజయ్ పాదయాత్ర 9వ రోజు గురువారం రామన్నపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ రాజీనామా చేయించాలి. నైతిక విలువలుంటే ఉప ఎన్నికలో కొట్లాడుదాం రండి. లీటర్ పెట్రోల్‌పై రూ.30 దోచుకుంటూ ధరల పెంపుపై మాట్లాడటం సిగ్గుచేటు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీళ్ల కోసం రూ. లక్షకోట్లకు పైగా ఖర్చు చేశారు. యాద్రాద్రి ప్రాంత ప్రాజెక్ట్ కోసం రూ.700 కోట్లు ఖర్చుపెట్టలేరా? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ మాటలన్నీ గాలి మాటలే. ప్రజలు సీఎం మాటలు నమ్మే పరిస్థితి లేదు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదనేది అవాస్తవం. నకిరేకల్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చామో లెక్కలు చెప్పాం. తప్పైతే, దమ్ముంటే కేసులు పెట్టుకోండి. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం. పార్టీ ఫిరాయించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్