‘టీడీపీకి అసలు సిసలు అధ్యక్షుడు రామోజీరావు’

AP Minister Ambati Rambabu Takes On Ramoji Rao - Sakshi

తాడేపల్లి : ఏపీ ప్రభుత్వంపై పచ్చ పత్రికలు విషపు రాతలు రాస్తున్నాయని జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.  వారు విషం చిమ్ముతూ రాసే ప్రతి అవాస్తవంపై వాస్తవాలు తెలియజేస్తామని అంబటి స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. టీడీపీకి అసలు సిసలు అధ్యక్షుడు రామోజీరావేనన్నారు. 

‘టీడీపీని వెనుక ఉండి నడుపుతున్నది రామోజీరావు. టీడీపీకి అసలు సిసలు అధ్యక్షుడు రామోజీరావు. టీడీపీలో అంతా రామోజీరావు చెప్పినట్లే జరుగుతుంది. రామోజీరావు ఆమోదం లేకపోతే టీడీపీలో ఏదీ జరగదు. టీడీపీలో ఎమ్మెల్యే టికెట్లు కూడా రామోజీరావు నిర్ణయిస్తారు. చంద్రబాబు, రామోజీరావుది విడదీయరాని బంధం. పోలవరంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.పోలవరంలో నామినేషన్‌పై రామోజీరావు బంధువులకు పనులు ఇచ్చారు. వాటిని రద్దు చేసి పారదర్శకగా వేరే వారికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు’ అని ధ్వజమెత్తారు అంబటి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top