స్వచ్ఛత కోసం ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛత కోసం ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వండి

May 1 2026 7:56 AM | Updated on May 1 2026 7:56 AM

కోల్‌సిటీ: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రామగుండం నగరాని కి మంచి ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వాలని మేయర్‌ మహంకాళి స్వామి కోరారు. స్థానిక 49వ డివిజన్‌లోని మార్కండేయ కాలనీలో డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్ల య్య, కార్పొరేటర్‌ సాగి సంతోష్‌రావుతో కలిసి మే యర్‌ వార్డు పర్యటన చేపట్టారు. ఎమ్మెల్యే సూచ నల మేరకు స్వచ్ఛతపై దృష్టి సారించి కాలువల్లో పూడికతీత చేపట్టామని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఇంటింటా అవగాహన క ల్పిస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో వరద ప్ర భావానికి గురైన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ దఫా ముందుగానే కాలువల్లో పూడికతీత చేపట్టామని అన్నారు. శానిటేషన్‌లో మార్పు కనిపిస్తున్నందున స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరం ఉత్తమ ర్యాంకు సాధించేందుకు మంచి ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వా లని ఆయన కోరారు. పలువురు కార్పొరేటర్లతోపాటు నగరపాలక సంస్థ ఎస్‌ఈ గురువీర, ఈఈ పీవీ రామన్‌, డీఈ ఆఫ్తాబ్‌, ఏఈ మీర్‌, టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యం అవసరం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రామగుండం మంచి ర్యాంకు సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని మేయర్‌ మహంకాళి స్వామి అన్నారు. గోదావరిఖని లక్ష్మీనగర్‌ ప్రాంతంలో ఆయన వ్యాపారులు, స్థానికులకు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఎలా ఇవ్వాలో మేయర్‌ వివరించారు. అక్కడికక్కడే ప్రజల మొబైల్‌ ఫోన్లలో ఫీడ్‌బ్యాక్‌ నమోదు చేయించారు. నగర శుభ్రత, మురుగు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో ప్రజల అభిప్రాయాలు ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు.

రామగుండం మేయర్‌ మహంకాళి స్వామి

Advertisement
 
Advertisement
Advertisement