అదనపు జిల్లా జడ్జిగా లావణ్య | - | Sakshi
Sakshi News home page

అదనపు జిల్లా జడ్జిగా లావణ్య

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

గోదావరి టౌన్‌: గో దావరిఖని అదనపు జి ల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. హన్మకొండ లేబ ర్‌ కోర్టుకు బదిలీ చేయగా ఆయన స్థానంలో సంగారెడ్డి నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి లావణ్యను నియమించారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 35 మంది జిల్లా న్యాయమూర్తులను హైకోర్టు రిజిస్ట్రార్‌ బదిలీ చేశారు.

క్యూఆర్‌ కోడ్‌తో దరఖాస్తు

జ్యోతినగర్‌: రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు ప రిధిలోని నిరుద్యోగ యువత పోటీపరీక్షల శిక్షణకు క్యూ ఆర్‌ కోడ్‌ తో దరఖాస్తు చేసుకోవాలని సీఎస్సార్‌ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ప్రభావిత, పునరావాస ప్రాంతాలకు చెందిన యువత కోసం దీప్తి మహిళా సమితి సహకారంతో ఆర్నెల్లపాటు ఉచితంగా కోచింగ్‌ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

సౌకర్యాలు కల్పించాలి

ఓదెల: పనిప్రదేశాల్లో కూలీలకు సౌకర్యాలు క ల్పించాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. కొలనూర్‌లో చేపట్టిన పంట కాలువ పనులను డీఆర్డీవో శుక్రవారం పరిశీలించారు. ఆమె మా ట్లాడుతూ, పనిప్రదేశాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, నీడకోసం టెంట్‌, దప్పిక తీర్చడం కోసం మంచినీటి వసతి కల్పించాలన్నారు. ఎంపీడీవో అనిల్‌రెడ్డి, కార్యదర్శి శంకర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ జనార్దన్‌, మేట్‌ స్పప్న పాల్గొన్నారు.

భద్రత ప్రమాణాలు పాటించాలి

గోదావరిఖని: విద్యుత్‌ సరఫరాలో అత్యున్నత భద్రత ప్రమాణాలు పాటించి ప్రమాదాలను నివారించాలని డీడీఎంఎస్‌(ఎలక్ట్రికల్‌) కమలేశ్‌చౌదరి సూచించారు. సింగరేణి ఆర్జీ–వన్‌ ఏరి యాలోని గనుల్లో విద్యుత్‌ భద్రత, హైటెన్షన్‌ విద్యుత్‌ సరఫరా, సబ్‌స్టేషనన్ల నిర్వహణపై శు క్రవారం సదస్సు నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోచించాలని అన్నా రు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం అప్రమ త్తంగా ఉండడం ద్వారానే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఏరియా ఇంజినీర్‌ రాంమోహనరావు, టీటీసీ మేనేజర్‌ అశోక్‌రావు, ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు, డీజీఎంలు, గనుల గ్రూప్‌, పిట్‌ ఇంజినీర్లు, సేఫ్టీ ఆఫీసర్లు, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లు, ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

మట్టి తరలింపు అడ్డగింత

పెద్దపల్లిరూరల్‌: పాలితంలో శుక్రవారం మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నా రు. తమ గ్రామశివారు నుంచి అక్రమంగా మ ట్టి తరలించుకుపోతున్నారని ఆరోపిస్తూ మ హిళలతో సహా గ్రామస్తులు అడ్డుకున్నారు. స మచారం అందుకున్న రూరల్‌ పోలీసులు ఘట నా స్థలికి చేరుకుని సమస్యపై ఆరా తీశారు. మట్టి తరలింపునకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, వేబిల్లులను చూపించినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. నిబంధనల మేరకు తరలించుకుపోతున్నా అడ్డుకోవడం సరికాదని పోలీసులు గ్రామస్తులను సముదాయించారు. అధికారులతో చర్చించి వాస్తవాలు తెలుసుకో వాలని సూచించి ఆందోళన విరమింపజేశారు.

ప్రశ్నించే గొంతుకగా టీఎన్జీవో

పెద్దపల్లి: ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా మారాలని, ఇందులో టీఎన్జీఓ నా యకత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్‌ అన్నారు. ప్రభు త్వ ఉద్యోగులకు శుక్రవారం చేపట్టిన సభ్యత్వ నమోదు సందర్భంగా మాట్లాడారు. ప్రతిని ధులు కొమురయ్య, అయిరెడ్డి సందీప్‌రెడ్డి, ప్రవీణ్‌, ప్రేమ్‌సాగర్‌, పురుషోత్తంరెడ్డి, వెంకటేశం, హరీశ్‌, సంగీత, మోహన్‌, వెంకటహన్మంతు, శంకర్‌, అనిత, రాకేశ్‌, రమేశ్‌, సౌమ్య, సాధిక్‌, జహీర్‌ తదితరులు పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,968

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ లో శుక్రవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 7,968 ధర పలికింది. కనిష్టంగా రూ.6,161, సగటు రూ.7,658గా ధర నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement