.. అను నేను | - | Sakshi
Sakshi News home page

.. అను నేను

Feb 17 2026 7:18 AM | Updated on Feb 17 2026 7:18 AM

.. అన

.. అను నేను

పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా నూగిళ్ల మల్లయ్య మంథనిలో వొడ్నాల శ్రీనివాస్‌ ప్రమాణం కొలువుదీరిన బల్దియా కొత్త పాలకవర్గాలు కోరం లేక సుల్తానాబాద్‌ చైర్మన్‌ ఎన్నిక నేటికి వాయిదా ప్రమాణం చేయడంలో తడబడిన బల్దియా సభ్యులు

సాక్షి పెద్దపల్లి:

రామగుండం కార్పొరేషన్‌ సహా పెద్దపల్లి, మంథని మున్సిపల్‌ కొత్త పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. శిబిరాల నుంచి నేరుగా మున్సిపల్‌, కార్పొరేషన్‌ కార్యాలయాలకు ఉదయం చేరుకున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో జిల్లా ఉన్నాతాధికారులు ప్రమాణం చేయించారు. రామగుండంలో ఇద్దరు కార్పొరేటర్లు ఇంగ్లిష్‌, మిగతావారు తెలుగులో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత బాధ్యతలు చేపడుతున్నట్లు రికార్డుల్లో సంతకాలు చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో కొన్నిపదాలను పలకడంతో కొందరు సభ్యులు తడబడ్డారు. మరికొందరికి తెలుగుభాష సరిగ్గా రాక అధికారులే మొత్తం ప్రమాణపత్రం చదువుతూ సభ్యులతోప్రమాణం చేయించారు. తదుపరి చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహించగా, అధికార పార్టీ నుంచి మాత్రమే మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఏకగ్రీవంగా వారే ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.

రామగుండం మేయర్‌గా మహంకాళి స్వామి

రామగుండం మేయర్‌గా కాంగ్రెస్‌ పార్టీ సినీయర్‌ నేత మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా బీసీ నేత పాతిపెల్లి ఎల్లయ్య యాదవ్‌ ఎన్నికయ్యారు. పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌గా కాపు సామాజిక వర్గానికి చెందిన నూగిళ్ల మల్లయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌గా ముస్కాన్‌ నాజ్‌ ఎన్నికయ్యారు. మంథనిలో పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన వొడ్నాల శ్రీనివాస్‌ చైర్మన్‌గా, ముసుకుల సయేందర్‌రెడ్డిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకున్నారు. సుల్తానాబాద్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాలేదు. సభ్యులు సభకు గైర్హాజరు అయ్యారు. దీంతో కోరం లేక సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్‌పర్సన్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ప్రశాంతంగా.. ఏకగ్రీవంగా..

రామగుండం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉంటే.. కాంగ్రెస్‌ 38, మంథనిలో 13 వార్డులకు 11, పెద్దపల్లిలో 36వార్డులకు 27వార్డులు కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను దక్కించుకుంది. రామగుండంలో పదవీ ప్రమాణ స్వీకారానికి బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు.

బల్దియాల ఎదుట కోలహలం

రామగుండం మేయర్‌గా బాధ్యతలు స్వీకరించాక మహంకాళి స్వామి కౌన్సిల్‌ చాంబర్‌లోని కుర్చీలో ఆశీనులయ్యారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌, అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. మేయర్‌గా మహంకాళి స్వామిని జెడ్పీ సీఈవో నరేందర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. పెద్దపల్లిలో ఆర్డీవో గంగయ్య, మంథనిలో ఆర్డీవో సురేశ్‌ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ర్యాలీలతో విజయోత్సవాలు నిర్వహించారు.

నిజాయతీగా సేవలు అందించాలి

గోదావరిఖని: కొత్త కార్పొరేటర్లు నిజాయతీగా ప్రజాసేవ చేస్తే రాజకీయాల్లో మంచి భవిష్యత్‌ ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ సూచించారు. బల్దియా కార్యాలయంలో కొలువుదీరిన కార్పొరేటర్ల పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. పదవులు, ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ప్రజలే దిశానిర్దేశకులన్నారు. ఆవేశంతో కాకుండా సమన్వయంతో పనిచేస్తూ అబివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కానికి చొరవ చూపాల్సిన బాధ్యత మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య, పాలకవర్గంపై ఉంటుందని అన్నారు. సమావేశంలో మేయర్‌ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌ పాతిపెల్లి ఎల్లయ్య, అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

నూగిళ్ల మల్లయ్య

చైర్మన్‌, పెద్దపల్లి

ముస్కాన్‌ నాజ్‌

వైస్‌చైర్‌పర్సన్‌, పెద్దపల్లి

వొడ్నాల శ్రీనివాస్‌

చైర్మన్‌, మంథని

ఎం.సయేందర్‌రెడ్డి

వైస్‌ చైర్మన్‌, మంథని

మేయర్‌గా ఏకగ్రీవం

36 మంది సభ్యుల హాజరు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం అధికారులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వారితో ప్రమాణస్వీకారం చేయించిన తర్వాత చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను ఆర్డీవో గంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. చైర్మన్‌ అభ్యర్థిగా నూగిళ్ల మల్లయ్య పేరును సభ్యులు అమ్రేశ్‌, రమాదేవి బలపర్చగా.. వైస్‌ చైర్మన్‌ పదవికి మస్కాన్‌నాజ్‌ పేరును సభ్యులు పాగాల శ్రీకాంత్‌, ఈర్ల స్వరూప ప్రతిపాదించారు. మిగతావారెవరూ నామినేషన్లు వేయకపోవడంతో వారినే ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

వాస్తుదోషమని..

పెద్దపల్లి: మున్సిపల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య తన అనుచరులతో బల్దియా గేటు వెనుకాల నుంచి లోనికి వెళ్లారు. ఆఫీస్‌ ముందు నుంచి వెళ్తే వాస్తుదోషమని పూజారులు సూచించడంతో ఇలా వెళ్లారని అనుచరులు చెబుతున్నారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు హైదరాబాద్‌ క్యాంపు నుంచి కౌన్సిలర్లు పోలీసుల రక్షణ మధ్య బల్దియాకు చేరుకున్నారు. ఏసీపీ కృష్ణ, సీఐలు ప్రవీణ్‌ కుమార్‌, సుబ్బారెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు. ఏడోవార్డు కౌన్సిలర్‌ ఈర్ల స్వరూపను ఆమె భర్త ఈర్ల సురేందర్‌ ఎత్తుకొని ఆనందం వ్యక్తం చేశారు. స్వీట్లు తినిపించి, గజమాలతో సన్మానించారు. కాగా, బల్దియాలో జరిగిన ప్రమాణస్వీకారం, చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నరేశ్‌, వినయ్‌, కిరణ్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ సతీశ్‌, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

.. అను నేను1
1/5

.. అను నేను

.. అను నేను2
2/5

.. అను నేను

.. అను నేను3
3/5

.. అను నేను

.. అను నేను4
4/5

.. అను నేను

.. అను నేను5
5/5

.. అను నేను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement