సీఎండీని కలిసిన అధికారులు
గోదావరిఖని: సింగరేణి అధికారుల సంఘం నాయకులు సోమవారం ఆ సంస్థ సీఎండీ జ్యో తి బుద్ధప్రకాశ్‌ను సోమవారం హైదరాబాద్‌లో ని సింగరేణి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తమ అధికారుల పీఆర్‌పీ చెల్లించాలని, కోలిండియాలో మాదిరిగా ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. అనంతరం డైరెక్టర్(పా) బలరాంను కలిసి పెండింగ్ సమస్యలపై స్టక్చరల్ సమావేశం ఏర్పా టు చేయాలని విన్నవించారు. సీఎంవోఏఐ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులు, ఉపాధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్, కోశాధికారి నరేశ్ తదితరులు ఉన్నారు.
వేతనాలు చెల్లించాలి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్టు లో అద్దెవాహన డ్రైవర్లకు మూడు నెలలుగా కనీస వేతనాలు చెల్లించడంలేదని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్ అన్నారు. ప్రాజెక్టు పరిపాలన భవనం గేట్ నంబర్–1 సమీపంలో అద్దె వాహనాల డ్రైవర్లు సో మవారం విధులు బహిష్కరించి నిరసన వ్య క్తం చేశారు. చందర్ మాట్లాడుతూ, ఒప్పందం ప్రకారం వేతనాలు ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు. తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినిధులు శ్రీనివాస్ యా దవ్, సాగర్, ధనుంజయ్, శ్యామ్, సమ్మయ్య, ఇమ్రాన్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదుల నిరసన
సుల్తానాబాద్ రూరల్:రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యుడు మొహమ్మద్ ఖదీర్ హత్యపై స్థానిక న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరంచి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, న్యాయవా దులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోయిని భూమయ్య, న్యాయవాదులు పడాల శ్రీరాములు, జోగుల రమేశ్, పడాల అంజ య్య, సామల రాజేంద్రప్రసాద్, ఆవుల శివకృష్ణ, రుద్రారపు నర్సయ్య, చీకటి సంతోష్, దా సరి సత్యనారాయణ, చిలుక ఆనంద్, అంబాల నర్సయ్య, గుడ్ల వెంకటేశ్, వేముల స్నేహ, మడూరి పృథ్వీ, రుద్రారపు శ్యాంసుందర్, ఆరెపల్లి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లోనూ రాణించాలి
సుల్తానాబాద్‌రూరల్: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని డీవైఎస్‌వో సురేశ్ సూచించారు. సీఎం కప్ పోటీల్లో భాగంగా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం జిల్లాస్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌జిల్లా పోటీలు ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, ప్రతినిధులు శోభారాణి, సురేందర్, దాసరి రమేశ్, సిలివేరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
మేయర్ ఎన్నికకు దూరం
జ్యోతినగర్(రామగుండం): కార్పొరేషన్ మేయ ర్ ఎన్నికకు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నా రు. సోమవారం ఎన్టీపీసీలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, రాష్ట్ర నాయకు డు కౌశిక హరితో కలిసి ఆయన బీఆర్‌ఎస్ కా ర్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ దు ర్మార్గపు చర్యలతో బీఆర్‌ఎస్ అభ్యర్థులను అ న్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేయడం హేయమన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొర్పోరేటర్లు ప్రజా సమస్యలను పరి ష్కరించడంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహించాలని సూచించారు. తమ కార్పొరేటర్లు త్వ రలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు.
సీఎండీని కలిసిన అధికారులు
సీఎండీని కలిసిన అధికారులు
సీఎండీని కలిసిన అధికారులు
సీఎండీని కలిసిన అధికారులు


