సుల్తానాబాద్ ‘సుల్తాన్’ ఎవరో!
కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ సాధించినా..
సభ్యుల గైర్హాజరుతో
చైర్మన్ ఎన్నిక వాయిదా
చైర్మన్ అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడమే కారణం
రసవత్తరంగా సుల్తానాబాద్ పురరాజకీయం
సాక్షి పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మంథని మున్సిపల్ పాలకవర్గాల ప్రమాణస్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మ న్ ఎన్నిక ప్రక్రియ పూర్తయినా.. సుల్తానాబాద్ ఎ న్నిక వాయిదా పడడం చర్చనీయాంశంగా మారింది. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ పార్టీ సాధించినా.. ఎన్నిక వాయిదా పడడంతో సుల్తానాబాద్ బల్దియా రెండోచైర్మన్‌గా ఎవరికి అవకాశం దక్కుతందునే అంశం ఆసక్తిగా మారింది.
మెజార్టీ ఉన్నా..
సుల్తానాబాద్ చైర్మన్ జనరల్‌కు కేటాయించారు. 15 వార్డులకు కాంగ్రెస్ 12వార్డుల్లో విజయం సాధించింది. ఎమ్మెల్యే విజయరమణారావు ఎక్స్‌అఫీ షి యో ఓటును సుల్తానాబాద్‌లోనే నమోదు చేయించుకున్నారు. బీఆర్‌ఎస్‌లో ఒకరు, బీజేపీలో ఒకరు, ఏఐఎఫ్‌బీలో ఒకరు విజయం సాధించారు. సోమవారం ప్రమాణస్వీకారం ఉన్నా.. చైర్మన్ అభ్యర్థిత్వం ఖరారుకాకపోవడంతోనే సభ్యులు అందరూ డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేదని అధికారులు ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.
రేసులో ముగ్గురు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే విజయర మణారావు తన గెలుపుకు సహకరిస్తే మున్సిపల్ ఎ న్నికల్లో మీ కొడుకును చైర్మన్ చేస్తానని మాజీ ఎ మ్మెల్యే బిరుదు రాజమల్లుకు హామీ ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు విజయరమణారావు గెలుపుకోసం తీవ్రంగా కృషిచేశారు. ఆ కృతజ్ఞతతోనే ఎమ్మెల్యే విజయరమణారావు రిజర్వేష న్ ఖరారు అనంతరం చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎ మ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడు బిరుదు రా ధాకృష్ణను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే మంత్రి శ్రీధర్‌బాబు అనుచరుడైన జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్ తన భార్యకు కౌన్సిలర్‌గా టికెట్ తెచ్చుకున్నారు. అప్పుడే ఎమ్మెల్యే టికె ట్ ఇవ్వడానికి నిరాకరించినా.. మంత్రి ప్రోద్బలంతో చైర్మన్‌గిరీకి పోటీకి రానంటేనే టికెట్ ఖరారు చే శారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక చైర్మన్ పీ ఠం కోసం పట్టుబడుతుండడంతో చైర్మన్ అభ్యర్థి ఖ రారుకు చిక్కుముడి పడినట్లయింది. ఒకేఇంట్లో రెండు పదవులు ఇవ్వడం బాగుండదని, ప్రజల్లోకి త ప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఎమ్మె ల్యే .. అన్నయ్యగౌడ్ భార్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుండగా, చైర్మన్ కోసం అంతటి పుష్పలత ప్రయత్నాలు చేస్తుండడంతో తప్పనిపరిస్థితుల్లో ఎన్నిక వాయిదా వేయాల్సి వచ్చింది. వీరితోపాటు మాజీ చైర్‌పర్సన్ భర్త గాజుల రాజమల్లు సైతం చైర్మన్ పీఠం కోసం యత్నిస్తున్నారు. తమకు చైర్మన్ పీఠం ఇస్తే గెలిచిన తోటికాంగ్రెస్ అభ్యర్థులకు సైతం ఆర్థికసాయం చేస్తామని వీరిందరూ ఓపెన్ ఆఫర్ ఇస్తుండడంతో రాధాకృష్ణ అభ్యర్థిత్వాన్ని మిగిలిన సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. చివరకు సుల్తానాబాద్ చైర్మన్ పీఠం ఎవరిని వరించనుందోననే ఉత్కంఠ నెలకొంది.


