అన్నీతానై.. వ్యూహం రచించి | - | Sakshi
Sakshi News home page

అన్నీతానై.. వ్యూహం రచించి

Feb 17 2026 7:18 AM | Updated on Feb 17 2026 7:18 AM

అన్నీతానై.. వ్యూహం రచించి

అన్నీతానై.. వ్యూహం రచించి

ఎన్నికల నుంచి మేయర్‌ పీఠం దాకా.. సీనియారిటీ.. విధేయతకే పట్టం కట్టిన ఎమ్మెల్యే ఠాకూర్‌ రామగుండం మేయర్‌ పీఠం దక్కించుకున్న అధికార కాంగ్రెస్‌

గోదావరిఖని: సుమారు 13 నెలల తర్వాత రామగుండం బద్దియాపై కాంగ్రెస్‌ జెండా ఎగిరింది. అ ధికార పార్టీ వ్యవహరించిన వ్యూహం మేయర్‌ పీ ఠాన్ని ౖకైవసం చేసుకునేలా చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలుబడినప్పటి నుంచి మేయర్‌ పీఠం దక్కించుకునేంత వరకూ ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 50 కార్పొరేటర్‌ సీట్లు ఉన్న రామగుండంలో ఏడు గ్రామాలను కలిపి ఈ సారి 60 డివిజన్లకు పెంచారు.

పనిచేయని బీఆర్‌ఎస్‌ బలం..

బీఆర్‌ఎస్‌ కూడా బలంగా ఉన్నా.. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నాటినుంచి పూర్తయ్యే వరకూ క్యాంపు ఆఫీస్‌లోనే ఉండి ప్రణాళిక బద్ధంగా వ్యవహరించారు ఠాకూర్‌. ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ధీటుగా కాంగ్రెస్‌ అభ్యర్థులకు టికెట్‌ కేటా యించారు. కాంగ్రెస్‌ నుంచి గెలుపు గుర్రాల కోసం ఇంటిలిజెన్స్‌, పార్టీపరంగా, ప్రముఖ బీకాన్‌ సర్వే సంస్థ ద్వారా అన్ని డివిజన్లలో సర్వే నిర్వహించారు. నివేదిక ఆధారంగా బీఫామ్‌లు అందజేశారు. సర్వే నివేదిక ఆధారంగా 60మంది(ఇందులో 20మంది తన విధేయులు)కి కాంగ్రెస్‌ టికెట్లు ఇచ్చారు. వారిగెలుపుకోసం అహర్నిశలు శ్రమించారు. ఒంటరి గానే ప్రచారం చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు యత్నించారు. ఉదయం గనులపై గేట్‌ మీటింగ్‌లు, సాయంత్రం కార్నర్‌ మీటింగ్‌ల ద్వారా తమ అభ్యర్థుల గెలుపుకోసం శ్రమించారు. ప్రచార ఘట్టం చివరిరోజు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కూడా కార్నర్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ తీరుపై గట్టి సందేశం వినిపించారు. దీంతో 60 డివిజన్లలో 38 మంది కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లను గెలుపించుకుని పార్టీ బలం ప్రదర్శించారు. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌, బీఆర్‌ఎస్‌, ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకుని తమ బలాన్ని 48కి పెంచేశారు.

వ్యూహాత్మకం.. మేయర్‌ పీఠం

రాష్ట్రంలోనే కీలకమైన రామగుండం మేయర్‌ పీఠం అధిష్టించే విషయంలో కూడా ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నీతానై వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మేయర్‌ పీఠానికి కావాల్సిన బలం గెలుచుకోగానే కార్పొరేటర్లను హైదరాబాద్‌ క్యాంపునకు తరలించారు. కార్పొరేటర్లను సీఎం రేవంత్‌రెడ్డికి పరిచయం చేశారు. మేయర్‌ ఎంపికపై పూర్తి అధికారం తనకే ఉన్నా.. సీఎం, పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి తన అనుయాయులకే పట్టం కట్టబెట్టారు. తనకు అత్యంత విశ్వాసంగా ఉన్న కార్పొరేటర్‌ మహంకాళి స్వామిని మేయర్‌ పీఠంపై కూర్చోబెట్టారు. మిగతా కార్పొరేటర్లలో వ్యతరేకత రాకుండా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. డిప్యూటీ మేయర్‌ పదవిని బీసీ వర్గానికి కేటాయించి పాతిపెల్లి ఎల్లయ్యను డిప్యూటీ మేయర్‌గా ఎంపిక చేశారు. సీనియార్టీ, విశ్వసనీయత, విధేయతకు అందలం ఎక్కించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement