49 మంది కార్పొరేటర్ల ప్రమాణం | - | Sakshi
Sakshi News home page

49 మంది కార్పొరేటర్ల ప్రమాణం

Feb 17 2026 7:18 AM | Updated on Feb 17 2026 7:18 AM

49 మంది కార్పొరేటర్ల ప్రమాణం

49 మంది కార్పొరేటర్ల ప్రమాణం

కోల్‌సిటీ(రామగుండం): రామగుండం మేయర్‌, డి ప్యూటీ మేయర్‌ ఎన్నిక, కార్పొరేటర్ల ప్రమాణ స్వీ కారం కోసం సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 60 మంది కార్పొరేటర్లలో 49 మంది హాజరయ్యారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూ ర్‌ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌ నుంచి 10, 40వ డివిజన్ల కార్పొరేటర్లు ఎన్ని కైన అడ్డాల గట్టయ్య, కజంపురం జయప్రద సమా వేశానికి హాజరుకాగా, మిగిలిన 11 మంది బీఆర్‌ఎ స్‌ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. తెలుగు అక్షరమా ల ప్రకారం తొలుత 10వ డివిజన్‌ కార్పొరేటర్‌ అ డ్డాల గట్టయ్య, ఆఖరున 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ అనుము స్వరూప ప్రమాణం చేశారు. 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ మడిపెల్లి విజయ, 27వ డివిజన్‌ నుంచి ఆయేషాఖానమ్‌ ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు.

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఏకగ్రీవం

కాంగ్రెస్‌ నుంచి 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ మహంకాళి స్వామిని మేయర్‌ అభ్యర్థిగా 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ తాళ్లపెల్లి యుగందర్‌ ప్రతిపాదించగా, 38వ డివిజన్‌ కార్పొరేటర్‌ నెలికంటి రాము బలపరిచారు. మరో ప్రతిపాదన రాకపోవడంతో వీరే ఎన్నికై నట్లు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించారు. డిప్యూటీ మేయర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా 57వ డివిజన్‌ కార్పొరేటర్‌ పాతపెల్లి ఎల్లయ్య పేరును 30వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇసంపల్లి అంజయ్య ప్రతిపాదించగా, 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ షాహెదా బలపరిచారు. మరో ప్రతిపాదన రాకపోవడంతో పాతపెల్లి ఎల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ, ఎన్నికల పరిశీలకురాలు పద్మజారాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement