మంథని మకుటంపై కాంగ్రెస్‌ జెండా | - | Sakshi
Sakshi News home page

మంథని మకుటంపై కాంగ్రెస్‌ జెండా

Feb 17 2026 7:18 AM | Updated on Feb 17 2026 7:18 AM

మంథని మకుటంపై   కాంగ్రెస్‌ జెండా

మంథని మకుటంపై కాంగ్రెస్‌ జెండా

మంథని: మంథని మున్సిపల్‌లోని 13 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్‌ గెలుపొందింది. దీంతో చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌ పదవులు ఆ పార్టీనే వరించాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఏఐఎఫ్‌బీ పార్టీల కౌన్సిలర్లతో ఆర్డీవో సురేశ్‌ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్‌ కోసం వొడ్నాల శ్రీనివాస్‌ పేరును మద్దికట్ల స్రవంతి ప్రతిపాదించగా మార్పాక నిహారిక బలపరిచారు. ఒక్కరే పోటీలో ఉండడంతో వొడ్నాల శ్రీనివాస్‌ ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. వైస్‌ చైర్మన్‌కు ముస్కుల సహేందర్‌రెడ్డి పేరును కుర్ర లింగయ్య ప్రతిపాదిచగా పెంటరి రాజేందర్‌ బలపర్చారు. పోటీ లేకపోవడంతో సహేందర్‌రెడ్డి ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా సహాయక ఎన్నికల అఽధికారి మనోహర్‌ పాల్గొన్నారు. పాలకవర్గాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement