26న ‘గోపా’ స్వర్ణోత్సవాలు
పెద్దపల్లి: గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్(గోపా) స్వర్ణోత్సవాలు ఈనెల 26న హైదరాబాద్‌లో నిర్వహిస్తామని ఆ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి బుర్ర జగదీశ్వర్‌గౌడ్ తెలిపారు. స్వర్ణోత్సవాల ప్రచార పోస్టర్‌ను గురువారం సుల్తానాబాద్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. గౌడల సమస్యలు, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం తదితర అంశాలపై ఇందులో చర్చిస్తామన్నారు. ప్రతినిధులు అడ్డగుంట రాజేందర్‌గౌడ్, బైరగోని రవీందర్‌గౌడ్, అంతటి చిరంజీవిగౌడ్, ఏరుకొండ తిరుపతిగౌడ్, వేముల కిరణ్‌గౌడ్, పోడేటి వెంకటేశ్‌గౌడ్, పొన్నం శ్రీనివాస్‌గౌడ్, ముత్యం నరేశ్‌గౌడ్, కొయ్యడ రమాకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘మీ డబ్బు.. మీ హక్కు’పై అవగాహన
పెద్దపల్లి: ‘మీ డబ్బు.. మీ హక్కు’పై ఈనెల 20న క లెక్టరేట్‌లో అవగాహన కల్పిస్తామని లీడ్ బ్యాంక్ మే నేజర్ వెంకటేశ్ తెలిపారు. బ్యాంకుల్లో పొదుపులు, షేర్లు, డివిడెంట్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తది తరాల్లో డబ్బు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని, దీనికోసం శిబిరాలు నిర్వహిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


