చోరీల నియంత్రణకు చర్యలు
గోదావరిఖని: సింగరేణి ఆస్తుల పరిరక్షణ, చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాలరాజు సూచించారు. బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఆ యన గురువారం ఆర్జీ–2 ఏరియాలో పర్యటించారు. జీఎం వెంకటయ్య ఆయనను ఘనంగా స న్మానించారు. అనంతరం ఏరియాలో పర్యటించి భ ద్రతపై ఆరా తీశారు. సెక్యూరిటీ అధికారులతో సమావేశమయ్యారు. భద్రతా సిబ్బంది పనితీరు, విధుల నిర్వహణలో ఎదురవుతున్న ఆటంకాలు, అవసరమైన సౌకర్యాలు తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా సిబ్బంది విధుల్లో అప్రమత్తత, క్రమశిక్షణ, అత్యంత కీలకమని, సంస్థ ఆస్తుల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. ఎస్‌వోటూ జీఎం రాముడు, పర్సనల్ డీజీఎం అరవిందరావు, ఐఈడీ డీజీఎం చంద్రశేఖర్, సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్ మహమ్మద్ తదితరులు ఉన్నారు.
ఓసీపీల జీఎంకు సన్మానం
రామగుండం డివిజన్–2 పరిధిలోని ఓసీపీ–3ని కార్పొరేట్ ఓసీపీల జీఎం ఎలీషా సందర్శించారు. యంత్రాలను తనిఖీ చేసి పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో జీఎం వెంకటయ్య ఎలీషాను శాలువాతో ఘనంగా సన్మానించారు.
సింగరేణి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాలరాజు
ఆర్జీ–2 ఏరియాలో విస్తృత పర్యటన


