ఈకేవైసీ పూర్తిచేయాలి
పెద్దపల్లి: జిల్లాలోని రేషన్‌కార్డుదారులు ఈకేవై సీ పూర్తిచేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఇప్పటివరకు 76.29శాతమే ఈ కేవైసీ పూర్తయ్యిందని, మిగతా వారు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో ఇంకా 1,68,272 మంది సమీపంలోని రేషన్ దుకాణాల్లో ఈకేవైసీ పూర్తిచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం
పెద్దపల్లి: క్రీడా సామగ్రి అవసరమైన యువజన సంఘాలు ఈనెల 30వ తేదీలోగా దర ఖాస్తు చేయాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకట్ రాంబాబు తెలిపారు. సూచించారు. రిజిస్ట్రేషన్ ఉన్న, 18ఏళ్ల నుంచి 29ఏళ్ల వయసులోపు కలిగిన సభ్యులు కలిగి ఉన్న సంఘాలు అర్హులన్నారు. ఐదేళ్లలో ఆ సంఘాలు చేసిన సేవా కార్యక్రమాల ప్రతులను దరఖాస్తు తో జతచేయాలని సూచించారు. దరఖాస్తుల ను మేరా యువభారత్, కరీంనగర్ జిల్లా(బస్టాండ్ ఎదురుగా) కార్యాలయం నుంచి పొందాలని, వివరాలకు 91773 29258 నంబరు లో సంప్రదించాలని సూచించారు.
సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని పెద్దపల్లి, మంచిర్యా ల జిల్లాల్లో పంచాయతీ ఎ న్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. క్రమశిక్షణ, అప్రమత్తత, పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో ఎన్నికల ప్రశాంత వాతావరణంలో ముగిశాయన్నారు. డీసీపీలు భూక్యా రాంరెడ్డి, భాస్కర్ పర్యవేక్షణలో అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, జైపూర్, బెల్లంప ల్లి, ఏఆర్ ఏసీపీలు నాగేందర్, కృష్ణ, రమేశ్, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్, ప్రతాప్ పక డ్బందీ పర్యవేక్షణ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో, దూరదృష్టి ఇందుకు తోడైందని ఆ యన వివరించారు. అన్ని విభాగాల్లోని పోలీస్ సిబ్బంది విధుల్లో అంకితభావం, అప్రమత్తతో వ్యవహరించారని సీపీ ప్రశంసించారు.
జిల్లా వైద్యాధికారిగా ప్రమోద్‌కుమార్
పెద్దపల్లి: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా ప్రమోద్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన జగిత్యాల జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. కలెక్టర్ శ్రీకోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి జిల్లా వై ద్య, ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తించిన వాణిశ్రీ యథావిధిగా ప్రోగ్రాం అధికారిగా పెద్దపల్లిలోనే కొనసాగుతారు. కాగా, ఆర్‌బీఎస్‌కే సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో డీఎంహెచ్‌వో పాల్గొని పలు సూచనలు చేశారు.
చిరువ్యాపారికి సన్మానం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): వ్యాపారంలో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ ఢి ల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కేంద్రపభు త్వం నుంచి ఆహ్వానం అందుకున్న చిరువ్యా పారి అల్లూరులోని బాలసాని నిర్మలను గ్రామస్తులు సన్మానించారు. పీఎం స్వనిధి ద్వారా రు ణాలు తీసుకుని వ్యాపార రంగంలో రాణిస్తూ, సకాలంలో రుణవాయిదాలు చెల్లించడంలో ఆమె అగ్రస్థానంలో నిలిచారని బీజేపీ నాయకులు ప్రశంసించారు. ఈమేరకు గ్రామంలో గురువారం ఆమెను సన్మానించారు. నాయకులు ఆకుల శశికుమార్, మూకిరి రాజు, లింగం నాయక్, శంకర్, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, ప్రవీణ్, రమాదేవి, నర్మద, స్వరూప, రజిత తదితరులు పాల్గొన్నారు.
ఆదివరాహస్వామికి పూజలు
కమాన్‌పూర్(మంథని): దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ సుప్రియ గురువారం శ్రీఆదివరాహస్వామిని దర్శిచుకున్నారు. ఆలయ ఈవో కాంతారెడ్డి ఆమెకు శాలువా కప్పి ఘనంగా స న్మానించారు. కార్యక్రమంలో పలువురు నాయ కులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
ఈకేవైసీ పూర్తిచేయాలి
ఈకేవైసీ పూర్తిచేయాలి
ఈకేవైసీ పూర్తిచేయాలి


