ఎన్నికలు విజయవంతం
పెద్దపల్లి: జిల్లాలో మూడుదశల్లో పంచాయతీ ఎన్నికలను విజవంతంగా నిర్వహించామని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య తెలిపా రు. ఈమేరకు గురువారం కలెక్టర్ శ్రీహర్షను కలిసి పుష్ఫగుచ్చం అందించి కృతజ్ఞతలు తలిపారు.
24న రిటైర్డ్ ఉద్యోగులకు దీపావళి బోనస్
గోదావరిఖని: రిటైర్డ్ ఉద్యోగులకు లాభాల వాటా చెల్లిస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఈనెల 18న ఖాతాల్లో జమ చేశారు. అలాగే దీపావళి లాభాల బోనస్‌ను కూడా ఈనెల 24న చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా ఉద్యోగ విరమణ చేసిన వారికి వాటా వర్తించనున్నట్లు తెలిపింది.


