పైసలు పాయే..
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీపడిన ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చుచేశారు. ఫలితాలు వెలువడే వరకూ విజయం తనదేననే ధీమా తో అందినకాడికి అప్పు తీసుకొచ్చి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. తీరా ఓటమి పాలవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పైసలు పోయే, పదవి రాకపాయేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మానేరు తీరం, ఇటుకబట్టీలు, రైస్ మిల్లులు, కంకర క్వారీలు విస్తరించి ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు డబ్బులు ధారపోసినా ఫలితం తేడా కొట్టడంతో తలలు పట్టుకున్నారు.
పదవీ రాకపాయే..
ఓటమితో డీలాపడిన పంచాయతీ అభ్యర్థులు
ప్రచారం కోసం చేసినఅప్పులు తీర్పడం ఎట్లా?
పోల్ పోస్టుమార్టంలో రాజకీయ పార్టీల నాయకులు
పరిషత్ ఎన్నికల వైపు ఓటమిపాలైన అభ్యర్థుల చూపు
పైసలు పాయే..


