పనులు పూర్తిచేయండి | - | Sakshi
Sakshi News home page

పనులు పూర్తిచేయండి

Dec 18 2025 7:27 AM | Updated on Dec 18 2025 7:27 AM

పనులు

పనులు పూర్తిచేయండి

కోల్‌సిటీ(రామగుండం): అభివృద్ధి పనులు నా ణ్యతతో వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రామగుండం బల్దియా కమిషనర్‌ అరు ణశ్రీ ఆదేశించారు. అభివృద్ధి పనులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్‌ అ ధికారులతో కమిషనర్‌ బుధవారం సమీక్షించారు. నిర్ణీతవ్యవధిలో అభివృద్ధి పనులు ప్రా రంభించని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని అన్నారు. ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణ నిరాటంకంగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఈ గురువీ ర, ఈఈ రామన్‌, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్‌ నవీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు

జల సంచయ్‌–జల భాగీరథిలో భాగంగా చేపట్టిన భూగర్భ జలాల సంరక్షణ చర్యలు విజయవంతం చేయడంలో వార్డు అధికారులు సహకరించాలని అరుణశ్రీ కోరారు. అధికారు లు, సహాయకులకు అవగాహన కల్పించారు.

లింగ నిర్ధారణ నేరం

పెద్దపల్లి: స్కానింగ్‌ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చే స్తే చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆ రోగ్య శాఖాధికారి వాణిశ్రీ హెచ్చరించారు. జి ల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో బుధవా రం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భస్థ శిశు వు లింగనిర్ధారణ వ్యతిరేక చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతినిధులు శ్రీరాములు రవీ, శ్రీనయన, రాకే శ్‌, రాజగోపాల్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఒత్తిడిని దూరం చేయాలి

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): విద్యార్థులు సానుకూల ఆలోచనలతో ఒత్తిడి దూరం చేసుకోవచ్చని, తద్వారా కేరీర్‌లో విజయం సాధించవ చ్చని ప్రముఖ సైకలాజిస్ట్‌ లావణ్య భరద్వాజ అన్నారు. ‘ఆడపిల్లల సామాజిక భావోద్వేక శ్రే యస్సు’పై బుధవారం మల్యాల మోడల్‌ స్కూల్‌లో అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్‌ లక్ష్యాల సాధనతోపాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో కేరీర్‌ గైడెన్స్‌, కౌన్సెలింగ్‌, సోషల్‌ – ఎమోషనల్‌, వెల్‌బీయింగ్‌ అంశాలపై వివరించారు. ప్రిన్సిపాల్‌ పోచ య్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న వెల్‌బేబీ షో

గోదావరిఖని: స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన వెల్‌బేబీ షో ఆకట్టుకుంది. బాల, బాలికలను అందంగా ముస్తాబుచేసి పోటీలకు తీసుకొచ్చారు. బేబీ కింగ్‌, బేబీ క్వీన్‌, ప్రిన్స్‌, ప్రిన్సెన్స్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన చిన్నారులకు ఈనెల 23న సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో బహుమతలు అందజేయనున్నారు. కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు అనిత, ఆస్పత్రి ఏసీఎంవో అంబిక పాల్గొన్నారు.

కానిస్టేబుల్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం

ఓదెల(పెద్దపల్లి): కొమిర గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న టీఎస్‌ఎస్పీ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ పని శివాజీ కుటుంబాన్ని 17వ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాందాస్‌ బుధవారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ, కానిస్టేబుల్‌ శివాజీ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. అనంతరం కానిస్టేబుల్‌ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మృతుడి భార్య తేజస్విని, కుమారుడు రోదనలు మిన్నంటాయి.

పనులు పూర్తిచేయండి 1
1/3

పనులు పూర్తిచేయండి

పనులు పూర్తిచేయండి 2
2/3

పనులు పూర్తిచేయండి

పనులు పూర్తిచేయండి 3
3/3

పనులు పూర్తిచేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement