ఫలించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కల
సుల్తానాబాద్‌రూరల్: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వగ్రామాన్ని అభివృద్ధి చేయడంతోపాటు నిరుద్యోగ యువతకు ఏఐ టెక్నాలజీతో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూస్తానాని హామీ ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సర్పంచ్ పీఠం వరించింది. నీరుకుల్ల(కొమండపల్లి)కి చెందిన కాంపెల్లి సతీశ్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నీరుకుల్ల సర్పంచ్ రిజర్వేషన్ అనుకూలించడంతో సర్పంచ్‌గా పోటీచేశాడు. పోటీలో ఆరుగురు ఉన్నా.. బుధవారం జరిగిన ఎన్నికల్లో గ్రామస్తులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగికే పట్టం కట్టారు. సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, యువత, నిరుద్యోగుల కోసం ముందుగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.


