ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక
పెద్దపల్లి: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ప్రతిబింబింపజేసేది తెలంగాణ తల్లి విగ్రహమని కలెక్టర్ కో య శ్రీహర్ష అన్నారు. అదనపు కలెక్టర్ వేణుతో కలి సి కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి మాట్లాడారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా డిసెంబర్ 9న కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలిసారి ప్రకటన చేసిందని కలెక్టర్ గుర్తుచేశారు. కలెక్టరేట్‌కు వచ్చేవారిని ఆకట్టుకునేలా విగ్రహ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లా పాలనాధికారి ప్రకాశ్, ఆర్ అండ్ బీ ఈఈ భావ్‌సింగ్ పాల్గొన్నారు.
అవినీతిని అరికట్టాలి..
టోల్‌ఫ్రీ నంబరు 1064కు ఫోన్‌కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా తన కా ర్యాలయంలో విజిలెన్స్ వారోత్సవాల ప్రచార పోస్ట ర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు.
గడువులోగా సీఎమ్మార్ పూర్తిచేయాలి
యాసంగి సీఎంఆర్ సరఫరాలో నాణ్యత ప్రమాణా లు పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సీఎమ్మార్ డెలివరీపై అధికారులు, రైస్ మిల్లర్లతో ఆయన సమీక్షించారు. నాణ్యమైన బియ్యాన్ని గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, మేనేజర్ శ్రీకాంత్, ఎఫ్ సీఐ డివిజనల్ మేనేజర్ రవిప్రకాశ్ పాల్గొన్నారు.
అరవై ఏళ్ల పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో కలెక్టర్ కోయ శ్రీహర్ష


