ప్రయాణికుల పడిగాపులు
రామగిరి(మంథణి): మంథని డి పోకు చెందిన బస్సులు సమయానికి రాకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళ రెండు గంటలపాటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఒక్క బస్సు రాకపోవడంతో బస్టాండ్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆటోలు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. విద్యార్థులు పాఠశాలకు, ఉద్యోగులు కార్యాలయాలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు. రోజూ ఇదే పరిస్థితి ఉంటుందని, బస్సులు సమయానికి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బస్సుల రాకపోకలను సక్రమంగా అనుసరించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


