కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం
పెద్దపల్లిరూరల్: సీఎం రేవంతన్న సారథ్యంలోని ప్ర జాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీ లకు దిక్కుతోచడం లేదని ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు. పెద్దపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం హన్మంతునిపేటకు చెందిన మ్యాడగోని శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ సత్యం తో పాటు పలు వురు నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పారీ ్టలోకి ఆహ్వానించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళాసంక్షేమానికి ప్రాధాన్యతని చ్చారన్నారు. యువతకు ఉద్యోగాలకల్పన తదితర కార్యక్రమాలతో పాటు పెద్దపల్లిలో ట్రాఫిక్, మహిళా, రూరల్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు, బైపాస్‌రోడ్డు, బస్‌డిపో తదితర అనేక పనులను ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజార్టీ సర్పంచు పదవులను కాంగ్రెస్ కై వసం చేసుకోవడం ఖాయమన్నారు. నాయకులు రమేశ్, భూమయ్య, సతీశ్, సదయ్య, తిరుపతి, రాజేశం, కనకయ్య, ఆనంద్ తదితరులున్నారు.
సీసీఐ కేంద్రాల్లోనే మద్దతు ధర
రైతులు పండించిన పత్తి దిగుబడులను సీసీఐ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అమ్ముకోవాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలోని జిన్నింగ్‌మిల్లులో గురువారం సీసీఐ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. నాణ్యమైన పత్తికి క్వింటాల్‌ఽకు రూ.8,110 మద్దతు ధర లభిస్తుందన్నారు. వరిపంట కోసిన తర్వాత చాలామంది కొయ్యలను నిప్పుతో కాలుస్తున్నారని, అది మంచిపద్ధతి కాదన్నారు. భూసారం పెంచుకునేందుకు సేంద్రియ ఎరువుల వినియోగం మేలన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు


