కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలి

Dec 5 2025 6:02 AM | Updated on Dec 5 2025 6:02 AM

కనీస

కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలి

గోదావరిఖని(రామగుండం): సింగరేణి కార్మికుల పెన్షన్‌ పెంచాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. గురువారం పార్లమెంట్‌లో ఈసమస్యను లేవనెత్తారు. రిటైర్డ్‌ కార్మికులకు పెన్షన్‌ పథకం రివైజ్‌ కావడం లేదన్నారు. ఇప్పటికీ పెన్షన్‌ రూ.500 నుంచి వెయ్యి మధ్య ఉండడం తీవ్రమైన అన్యాయమన్నారు. కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి రిటైర్డ్‌ కార్మికులకు సరైన న్యాయం చేయాలని, సీఎంపీఎఫ్‌ ట్రస్ట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రోశయ్య వర్ధంతి

గోదావరిఖని: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య వర్ధంతిని గురువారం రామగుండం పోలీస్‌కమిషనరేట్‌లో ఘనంగా నిర్వహించారు. సీపీ అంబర్‌కిషోర్‌ఝా ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ శ్రీనివాస్‌, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, ఏవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించాలి

పెద్దపల్లి: ఉద్యోగులు, సిబ్బంది పనితీరును సూపర్‌వైజర్లు పర్యవేక్షించాలని డీఎంహెచ్‌వో వాణిశ్రీ సూచించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా యోగా, ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. జ్వరాల సర్వే, డ్రై డే, ఫ్రై డే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, పిల్లలకు వందశాతం టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రోగ్రాం అధికారులు ఆర్‌.రాజమౌళి, బి. శ్రీరాములు, కేవీ సుధాకర్‌రెడ్డి, బి.కిరణ్‌కుమార్‌, పీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆలోచనలు భేష్‌

జ్యోతినగర్‌(రామగుండం): విద్యార్థుల శాసీ్త్రయ ఆలోచనలు భేషుగ్గా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద అన్నారు. గురువారం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని జెడ్పీహైస్కూల్‌లో జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. వివిధ అంశాలపై విద్యార్థులు 218 ప్రదర్శనలను రూపొందించారని తెలిపారు. సీనియర్స్‌లో ఏడు, జూనియర్స్‌లో ఏడు ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో ఎంపికై నవారు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు ప్రశంసాపత్రాలు అందించారు. జిల్లా సైన్సు అధికారి వి.హనుమంతు, ఎంఈవో మల్లేశం, సురేంద్రకుమార్‌, హరిప్రసాద్‌, విమల, కొమురయ్య, హెచ్‌ఎంలు స్వర్ణలత, ఆగయ్య, రాంరెడ్డి, ఓదెలు, మల్లారెడ్డి, చంద్రయ్య, జగదీశ్వర్‌, శ్రీనివాచారి పాల్గొన్నారు.

పారిశుధ్య సిబ్బంది పని వేళల్లో మార్పులు

కోల్‌సిటీ(రామగుండం): వార్డు అధికారులు త మ దైనందిన విధుల్లో భాగంగా డివిజన్లలో పారిశుధ్య నిర్వహణ తీరుపై మరింత సమర్థవంతంగా పర్యవేక్షణ చేయాలని రామగుండం బల్దియా కమిషనర్‌ జె.అరుణశ్రీ అన్నారు. గు రువారం వార్డు అధికారులతో నిర్వహించిన స మావేశంలో మాట్లాడారు. కలెక్టర్‌ ఆదేశాల మే రకు చలి తీవ్రతను దష్టిలో ఉంచుకొని పారి శుధ్య సేవల పని వేళలను సవరించినట్లు తెలి పారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండో షిఫ్టులో సిబ్బంది సేవలందిస్తారన్నారు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో సరైన పారిశుధ్య నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్‌ కమిషనర్‌ మారుతి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కనీస పెన్షన్‌    రూ.10వేలు ఇవ్వాలి1
1/3

కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలి

కనీస పెన్షన్‌    రూ.10వేలు ఇవ్వాలి2
2/3

కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలి

కనీస పెన్షన్‌    రూ.10వేలు ఇవ్వాలి3
3/3

కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement