
నడకతో ఆరోగ్యం
జ్యోతినగర్(రామగుండం): నడకతో ఆరోగ్యంగా ఉంటామని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహె చ్ ఉపేందర్ అన్నారు. ఎన్టీపీసీ సింధూర కళాశాల లో ఆదివారం వాకర్స్‌కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ వయసు వారైనా రోజూ కనీసం 30 నిమిషాలపాటు వ్యా యామం చేయాలని సూచించారు. కళాశాల మైదానంలోని వాతావరణంలో ఇందుకు అనుకూలంగా ఉందని తెలిపారు. పదేళ్లుగా వాకింగ్ చేస్తున్న పాప య్య టీం ప్రతినిధులను శాలువాలు కప్పి సన్మానించారు. ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగులు కొమ్ము గోపాల్, రాజమౌళి, అశోక్, శంకరయ్య, పురుషోత్తం, సాయి లు, సత్యనారాయణ, విజన్ టెక్నాలజీ నిర్వాహకు లు మహేశ్వర్‌రెడ్డి, కిషన్‌రావు, మహేశ్, కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్, నాయకులు అబ్దుల్లా, తిరుపతిరెడ్డి ఉన్నారు.