ఓదెల మల్లన్నకు పట్నాలు | - | Sakshi
Sakshi News home page

ఓదెల మల్లన్నకు పట్నాలు

Oct 20 2025 7:26 AM | Updated on Oct 20 2025 7:26 AM

ఓదెల

ఓదెల మల్లన్నకు పట్నాలు

ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలివవచ్చారు. కోనేరులో స్నానం ఆచరించారు. మల్లికార్జునస్వామి, సీతారామచంద్రస్వామి, నందీశ్వరులను దర్శించుకున్నారు. అర్చకులు వీరభద్రయ్య, నరసింహచారి ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేశారు. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నాలు వేయించారు. బోనాలతో నైవేద్యం సమర్పించారు. ఆలయ ఈవో సదయ్య, జూనియర్‌ అసిస్టెంట్‌ కుమారస్వామి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ఆదివరాహస్వామికి పూజలు

కమాన్‌పూర్‌(మంథని): ప్రసిద్ధ శ్రీఆదివరాహస్వామి దర్శనం కోసం ఆదివారం భక్తులు పో టెత్తారు. స్వామివారి దర్శనం అనంతరం ము డుపులు చెల్లించుకున్నారు. అనంతరం పలువురు భక్తులు అన్నదానం చేశారు.

రైళ్లన్నీ కిటకిట

రామగుండం: దీపావళి పండుగ పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న ప్రయాణికులతో రైళ్లు, రైల్వేస్టేషన్లు ఆదివారం కిటకిటలాడాయి. భాగ్యనగర్‌, సింగరేణి, ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌, కేరళ తదితర రైళ్లలో రద్దీ బాగా పెరిగిపోయింది. శనివారం కూడా సెలవురోజు అయినా.. బీసీ బంద్‌ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. దీంతో రైళ్లన్నీ ఆదివారం రద్దీగా మారాయి.

ఆస్పత్రిలో పార్కింగ్‌ పాట్లు

పెద్దపల్లిరూరల్‌: జిల్లా ప్రభుత్వ, మాతాశిశు ఆస్పత్రుల్లో వాహనాల పార్కింగ్‌ ఇష్టారాజ్యంగా ఉంటోంది. ప్రధానంగా ద్విచక్రవాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలుపుతున్నారు. గర్భిణులకు తీసుకొచ్చే 102, అత్యవసర వైద్యం కోసం బాధితులను తీసుకొచ్చే 108 వాహనాలు ఆస్ప త్రి ఆవరణలోకి వచ్చివెళ్లేందుకు ద్విచక్రవాహనాలు అడ్డుగా ఉంటున్నాయి. పేషెంట్లు, బంధువుల రాకపోకలకూ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

అభివృద్ధే లక్ష్యం

గోదావరిఖని: అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా ఊరుకునేది లేదని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ హెచ్చరించారు. స్థానిక బస్టాండ్‌ సమీపంలో చిరువ్యాపారులు నిర్మించుకున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.

అంతర్గాంను అభివృద్ధి చేస్తాం

అభివృద్ధిలో అంతర్గాం మండలాన్ని అగ్రగామిగా నిలుపుతామని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ పేర్కొన్నారు. మండల ముఖ్య నాయకులతో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు ధారవేణి సంతోష్‌, తమ్మనవేని మణికుమార్‌, అజయ్‌, ప్రవీణ్‌ కాంగ్రెస్‌లో చేరారు. నాయకులు భాను తిరుపతినాయక్‌, హనుమాన్‌రెడ్డి, కాంపెల్లి సంతోష్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

సంక్షోభంపై దృష్టి సారించండి

పెద్దపల్లి: బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలోని దాదా పు 25,000 మంది విద్యార్థులు ఫీజు బకాయిల చెల్లింపులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సంక్షోభంపై దృష్టి సారించాలని ఎంపీ వంశీకృష్ణ కోరారు. తగిన చర్యలు తీసుకోవా లని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి రూ.200 కోట్లు ప్రైవేట్‌ పాఠశాలలకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.ల

ఓదెల మల్లన్నకు పట్నాలు 1
1/2

ఓదెల మల్లన్నకు పట్నాలు

ఓదెల మల్లన్నకు పట్నాలు 2
2/2

ఓదెల మల్లన్నకు పట్నాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement