కంపుకొడుతున్న కాలనీలు
ఇది రామగుండం నగరంలోని ఇందిరానగర్ కల్లు డిపో ఎదుట గల ఓపెన్ ప్లాట్. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. సమీపంలోని ఇళ్ల నుంచి వెలువడే చెత్తను ఇందులోనే పడేస్తున్నారు. దోమలు వృద్ధి చెంది స్థానికులపై దాడులు చేస్తున్నాయి. ఆహారం కోసం ఇక్కడకు వస్తున్న పందులు స్వైర విహారం చేస్తున్నాయి.
ఇది గోదావరిఖని శారదానగర్‌లోని బల్దియా వాటర్ ట్యాంకు ఎదుట రోడ్డు. దీనిపక్కనే చెత్త ఇలా పేరుకుపోయింది. వాటర్ ట్యాంక్ ఆవరణలోని క్యాంపు కార్యాలయానికి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయడానికి వెళ్లే ఎస్‌ఈ స్థాయి అధికారి నుంచి మొదలు శానిటరీ ఇన్‌స్పెక్టర్ వరకు చాలా మంది వచ్చిపోతుంటారు. వాటర్ ట్యాంక్ గేటు సమీపంలోనే చెత్త ఇలా కుప్పలుగా పేరుకుపోతున్నా ఎవరూపట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఇది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఓపీ వద్ద తీసిన చిత్రం. వర్షాలు ప్రారంభమవడం జలుబు, ఒళ్లునొప్పులు, జ్వరాలతో బాధపడుతున్నవారు ఇలా ఆస్పత్రికి వస్తున్నారు. ఈఏడాదిలో ఇప్పటివరకు ఒక్క డెంగీ కేసు నమోదుకాకున్నా.. 29 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి.
కంపుకొడుతున్న కాలనీలు
కంపుకొడుతున్న కాలనీలు
కంపుకొడుతున్న కాలనీలు


