
సంచులే బ్యాగ్‌లు
– కరుణాకర్, డీసీపీ, పెద్దపల్లి
నా విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తయ్యింది. నాన్న స్కూల్లో జాయిన్ చేస్తే.. నాకంటే ఒక్క క్లాస్ పెద్దయిన మా బ్రదర్‌తో కలిసి నడుచుకుంటూ పోయేవాడిని. ఎనిమిదో తరగతి వరకు ఉప్పల్, తొమ్మిదో తరగతి హుజూరాబాద్, పదో వతరగతి మళ్లీ ఉప్పల్ ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. బియ్యపు సంచులను బ్యాగ్‌లుగా తయారుచేసి కుట్టిస్తే, వాటిని భుజానికి వేసుకుని స్కూల్‌కు పోయేవాళ్లం. తొలిరోజు స్కూల్‌కి పోయినప్పుడు వర్షం పడేది. అప్పుడు పుస్తకాలు తడవకుండా షర్ట్ జేబులో దాచుకునేవాడిని. చిన్నారులను సర్కారు బడికే పంపించాలి. వారిపై ఖర్చుచేసే డబ్బు ఆదా చేస్తే భవిష్యత్‌లో ఎంతోఉపయోగపడుతుంది. చదువుపై ఆసక్తి ఉంటే సర్కారు బడిలో చదివినా ఉన్నతంగా ఎదగవచ్చు. ప్రతీఒక్కరికి పసిప్రాయంలో అనేక అనుభూతులు ఉంటాయి. నాకు అలాగే ఉన్నాయి. అప్పటిరోజులు గోల్డెన్ డేస్.