విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

Jun 7 2025 12:05 AM | Updated on Jun 7 2025 12:05 AM

విగ్ర

విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

పాలకుర్తి(రామగుండం): కుక్కలగూడురులోని శివాలయ, త్రిశక్తి దేవాలయంలో (వారాహి, ల లిత, రాజశ్యామల) విగ్రహ ప్రతిష్ఠాపన మ హోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించా రు. గ్రామస్తుడు, ఎన్‌ఆర్‌ఐ పోతురాజుల అంబికా–రాధాకిషన్‌ చేపట్టిన ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ దంపతులతోపాటు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ కాంట్రాక్ట్‌ కార్మికసంఘం అధ్యక్షుడు కౌశిక హరి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజ లు చేశారు. ఈకార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా లాసెట్‌

రామగిరి(మంథని): సెంటినరీరికాలనీలోని మంథని జేఎన్టీయూలో శుక్రవారం లాసెట్‌ ప రీక్ష ప్రశాతంగా జరిగింది. మూడు సెషన్‌లలో భాగంగా నిర్వహించిన పరీక్షకు ఉదయం 100 మందికి 61 మంది, మధ్యాహ్నం 100 మందికి 55మంది, సాయంత్రం 79 మందికి 66 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై చంద్రకుమార్‌ ఆ ధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.

రేషన్‌షాపు ఆకస్మిక తనిఖీ

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): బల్దియా లోని 15వ డివిజన్‌ పోస్టాఫీసు ఏరియా రేషన్‌షాప్‌ను జిల్లా పౌర సరఫరాల అధికారులు శు క్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం తూకంలో తక్కువగా వస్తున్నాయని మాజీ కా ర్పొరేటర్‌, కార్డుదారులు గురువారం ఆందోళ కు దిగారు. ఆ తర్వాత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పెద్దపల్లి డిప్యూటీ తహసీ ల్దార్‌ రవీందర్‌, అధికారులు సంతోష్‌సింగ్‌, శ్రీనివాస్‌ స్పందించి రేషన్‌షాప్‌ తనిఖీ చేశారు. సాంకేతిక సమస్యలతో ఆరు కేజీలకు బదులు ఐదు కేజీలు పంపిణీ చేసినట్లు గుర్తించారు. ల బ్ధిదారుకు మిగతా బియ్యం పంపిణీ చేయాలని రేషన్‌ డీలర్‌కు సూచించారు. రికార్డులు సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూ డు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నామని, తద్వారా ఒక్కో కార్డుదారు ఆరుసార్లు వే లిముద్రులు తీసుకోవాల్సి వస్తోందని అధికా రులు తెలిపారు. అయినా, ఈనెల 30వ తేదీ వరకు బియ్యం అందిస్తామని అన్నారు. మాజీ కార్పొరేటర్‌ శంకర్‌ నాయక్‌, నాయకుడు వీరారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మౌలిక వసతులపై ఆరా

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): హాస్టల్‌ ప్రారంభం నుంచే విద్యార్థులకు మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుందని మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయాల సంయుక్త కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ అన్నా రు. స్థానిక బీసీ హాస్టల్‌ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టళ్లలో వసతుల కల్పన, చిన్న మరమ్మతులకు నిధులు మంజూయ్యాయని తెలిపారు. ఈ నిధులతో చేపట్టిన పనులు సక్రమంగా చేశారా? అని ఆయన ఆరా తీశారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, క్యాంటీన్‌ తదితర సౌకర్యాలు పరిశీలించారు.

విదేశీ విద్య కోసం దరఖాస్తుల ఆహ్వానం

యైటింక్లయిన్‌కాలనీ: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు సీఎం విదేశీ విద్యా పథకం కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాల ని మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ యాస్మిన్‌బాషా, జమాత్‌ ఇస్లా మీ హింద్‌ టెమ్రిస్‌ వైస్‌ ప్రెసి డింట్‌ ఎండీ ఇస్మాయిల్‌ తెలిపారు. అమెరికా, యూకే, కెనడా, సింగపూర్‌, జర్మనీ, దక్షణ కొరి యా, జపాన్‌, ఫ్రాన్స్‌, న్యూజీలాండ్‌లో పీజీ, పీ హెచ్‌డీ కోర్సులు చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికై న వారికి ఉపకార వేతనం కింద రూ.20లక్షలు ప్రయాణ టికెట్‌ కోసం మంజూరు చేస్తారని వివరించారు.

విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు 
1
1/3

విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు 
2
2/3

విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు 
3
3/3

విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement