
‘కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు’
గోదావరిఖని: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. మేడే సందర్భంగా ఆర్జీ–1 ఏరియా జీడీకే–2వ గని వద్ద గురువారం ఆయన ఎర్రజెండా ఎగురవేశారు. సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. కార్మికలోకమంతా ఒక్కటై పోరాడిల్సిన సమయం వచ్చిందన్నారు. ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు వడ్డెపల్లి శంకర్, నారాయణదాసు మారుతి, రామరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.