విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Mar 20 2025 1:44 AM | Updated on Mar 20 2025 1:41 AM

● సమస్యల పరిష్కరానికి పోలీస్‌దర్బార్‌ ● రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

గోదావరిఖని: విధుల్లో నిర్లక్ష్యం వహించి పోలీస్‌శా ఖ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా హెచ్చరించారు. కమిషనరేట్‌లో బుధవారం సీపీ పోలీస్‌దర్బార్‌ నిర్వహించారు. ఎ లాంటి సమస్యలు ఉన్నా దర్బార్‌ దృష్టికి తీసుకురావడం ఇబ్బందిగా ఉంటే నేరుగా తన ఆఫీస్‌కు రా వాలని సీపీ సూచించారు. ఒకే కుటుంబం స్ఫూర్తి తో సమన్వయం, క్రమశిక్షణ, ప్రణాళికా బద్ధంగా వి ధులు నిర్వహించాలన్నారు. పోలీస్‌శాఖ, యూనిఫాంపై గౌరవం ఉంటే చట్ట వ్యతిరేకమైన పనులపై ఆలోచన రాదన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలని, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. త ద్వారా మానసిక, శారీర ఒత్తిడి నుంచి దూరం కావచ్చన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని, వాటిని తట్టుకోలేక క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ గురించి ఆలోచించాలని సూ చించారు. ప్రతి రెండు నెలలకోసారి మెడికల్‌ క్యాంపు నిర్వహించి హెల్త్‌ చెకప్‌ చేయిస్తామని సీపీ వివరించారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌, ఏఆర్‌ ఏసీపీలు రాఘవేంద్రరావు, ప్రతాప్‌, ఆర్‌ఐలు దామోదర్‌, వామనమూర్తి, సంపత్‌, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

జనగామ ఆలయంలో పూజలు..

గోదావరిఖనిటౌన్‌ : సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా దంప తులు జనగామలోని శ్రీత్రిలింగేశ్వరస్వామి ఆల యంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement