పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్ సో మవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీసీపీగా పనిచేసిన చేతన హైదరాబాద్‌లోని వుమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ అయిన విషయం విదితమే.
దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పీఎంఎఫ్‌ఎంఈ (ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్) పథకం కోసం ఈనెల 12 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్ సోమవారం తెలిపారు. రాష్ట్ర ఆహారశుద్ధి సంస్థ ఆధ్వర్యంలో 35 శాతం రాయితీతో అందించే రుణాల కోసం ఆసక్తి, అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాల కోసం డీఆర్పీ రామకృష్ణ, సెల్ నంబరు 63053 45388లో సంప్రదించాలన్నారు. దరఖా స్తులను కలెక్టరేట్‌లోని రూం నంబరు 231లో గల జిల్లా పరిశ్రమల కేంద్రంలో అందించాలని కోరారు.