వనిత.. అన్నింటా ఘనత | - | Sakshi
Sakshi News home page

వనిత.. అన్నింటా ఘనత

Mar 8 2025 1:24 AM | Updated on Mar 8 2025 1:23 AM

ఊరిపై మమకారం.. సేవకు శ్రీకారం

చిన్న హోటల్‌.. పెద్ద బాధ్యత

రామగిరి(మంథని): ఊరిపై మమకారంతో సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు రేండ్ల శారద. మండలంలోని కల్వచర్ల గ్రామానికి చెందిన శారద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అదే గ్రామానికి చెందిన రేండ్ల కుమార్‌స్వామితో వివాహం జరిగింది. మహిళల నిరుద్యోగ సమస్య, ఆర్థిక ఇబ్బందులను చూసి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని భర్త సహకారంతో ఆర్‌ఎస్‌కే ఆపన్న హస్తం ఏర్పాటు చేశారు. దాని ద్వారా గ్రామంలోని మహిళలకు ఉచితంగా పరికరాలు అందించారు. మహిళలకు కుట్లు–అల్లికలు, బ్యూటిషియన్‌, కుట్టు మిషన్‌ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. న్యాక్‌ సంస్థ ద్వారా సొంత ఖర్చులతో సర్టిఫికెట్స్‌ను అందించారు. ఒక్కో విడతలో సుమారు 40 మందికి మూడు నెలల పాటు శిక్షణ అందిస్తున్నారు. ‘ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్‌లు పూర్తి చేశాం. ప్రస్తుతం ఐదో బ్యాచ్‌ కొనసాగుతుంది. నా భర్త సహకారంతో సేవ చేయడం తృప్తిగా ఉంది’.. అని శారద వెల్లడించారు.

మెట్‌పల్లిరూరల్‌(కోరుట్ల): మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌కు చెందిన బట్టు సుశీల చిన్న హోటల్‌ నడిపిస్తూ తన కుమారుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దింది. సుశీల, భర్త గంగరాజు గ్రామంలో హోటల్‌ నడిపించేవారు. 16 ఏళ్ల క్రితం గంగరాజు గుండెపోటుతో మృతిచెందాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అతడు చనిపోయిన సమయంలో పిల్లలంతా చిన్నవారే. అప్పటి నుంచి సుశీల నలుగురు పిల్లల బాధ్యతను మోసింది. ప్రస్తుతం పెద్దకుమారుడు సుమన్‌ ఆర్మీలో పనిచేస్తుండగా, చిన్న కొడుకు రంజిత్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు కూతుళ్ల వివాహం చేసింది.

వనిత.. అన్నింటా ఘనత1
1/1

వనిత.. అన్నింటా ఘనత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement