కనీస వేతనం ఇవ్వాల్సిందే | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనం ఇవ్వాల్సిందే

Mar 7 2025 9:26 AM | Updated on Mar 7 2025 9:21 AM

పెద్దపల్లిరూరల్‌: కార్మికులకు ప్రతి నెలా కనీసవేతనం రూ.26వేలు చెల్లించాలని, ఈ మేరకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుమారస్వామి, ముత్యంరావు డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసవేతనా ల నిర్ణయాన్ని అశాసీ్త్రయంగా చేసిందని ఆరోపించారు. 2024 జనవరి 29న విడుదల చేసిన డ్రాఫ్ట్‌లను సవరించాలని పేర్కొన్నారు. ఐదేళ్లకోసారి కాలవ్యవధి పూర్తయినా సవరించకపోవడం దారుణమన్నారు. దీంతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. యజమాన్యాలకు మేలు చేసేలా పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కనీసవేతనాల సలహా మండలిలో కార్మి కుల సమస్యలపై నిరంతరం పోరాడే సంఘాల కు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయమన్నారు. నాయకులు భిక్షపతి, రామాచారి, సీపెల్లి రవీందర్‌, అంజయ్య, అరవింద్‌, శంకర్‌, లక్ష్మారెడ్డి, బ్రహ్మచారి, మహేందర్‌, ఖాజా, లక్ష్మీనారా యణ, ఉపేందర్‌, సాగర్‌, మల్లేశ్‌, తిరుపతి, మహేశ్‌, గట్టయ్య, చందు, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement