మల్కాపూర్ శివారులోని 56, 57 సర్వే నంబర్లలో గల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం జరిగిందని బల్దియా అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా, ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్రమ నిర్మాణానికి విద్యుత్ అధికారులు కరెంటు మీటరు మంజూరు చేయడం శోచనీయం. ప్రభుత్వ స్థలంలో చేట్టిన నిర్మాణాలపై కలెక్టర్ కార్యాలయం, రామగుండం నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశాం. – మామిడాల చంద్రయ్య, మాజీ కౌన్సిలర్
నోటీసులు జారీ చేశాం
మల్కాపూర్ గ్రామ శివారులోని ఐదో డివిజన్‌లో చేపట్టిన నిర్మాణంపై మాకు ఫిర్యాదు అందింది. దీనిపై సంబంధిత నిర్మాణదారుకు నోటీసులు జారీ చేశాం. స్థలానికి సంబంధించిన వివరాల కోసం తహసీల్దార్ కార్యాలయానికి లేఖ రాశాం. వివరాలు అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం.
– దీపిక, టౌన్ ప్లానింగ్ అధికారి, రామగుండం బల్దియా