ఏసీబీకి పట్టుబడిన కోరుట్ల ఎస్సై–3 | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడిన కోరుట్ల ఎస్సై–3

Mar 6 2025 1:31 AM | Updated on Mar 6 2025 1:29 AM

కోరుట్ల: పేకాటలో దొరికిన సెల్‌ఫోన్‌ వాపస్‌ ఇవ్వడానికి రూ.5వేలు డిమాండ్‌ చేసి వసూలు చేసిన క్ర మంలో జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్సై–3 రూపావ త్‌ శంకర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు.. గత నెల 21న కోరుట్ల మండలం జోగన్‌పల్లి శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని స్పెషల్‌పార్టీ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20వేలు స్వాధీనం చేసుకుని వారికి సంబంధించిన వాహనాలు, సెల్‌పోన్లు కోరుట్ల ఠాణాలో అప్పగించారు. ఎస్సై శంకర్‌ కేసు నమోదు చేశారు. అనంతరం పేకాటరాయుళ్లకు వాహనాలు, సెల్‌ఫోన్లు ఇచ్చే క్రమంలో డబ్బులు డిమాండ్‌ చేయగా వారిలో కొందరు డబ్బులు ఇచ్చి సెల్‌ఫోన్లు, వాహనాలు తీసుకెళ్లారు. రాయికల్‌ మండలం ఉప్పుమడిగెకు చెందిన బండారి శ్రీనివాస్‌ మాత్రం తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పి స్థానిక కాంగ్రెస్‌ నాయకుడితో ఫోన్‌ చేయించుకున్నాడు. తరువాత ఎస్సై శంకర్‌ ఫోన్‌ వాపస్‌ ఇచ్చినప్పటికీ డబ్బులు డిమాండ్‌ చేయడం ఆపలేదు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ ఏసీబీనీ ఆశ్రయించాడు. బుధవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌ గేటు ముందు శ్రీనివాస్‌ రూ.5వేలను ఎస్సై శంకర్‌కు ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎస్సై శంకర్‌ మరో మూడు నెలల్లో రిటైర్మెంట్‌ కానున్నారు.

పేకాటలో దొరికిన సెల్‌ఫోన్‌ ఇవ్వడానికి..

రూ.5 వేలు లంచం డిమాండ్‌

ఏసీబీకి పట్టుబడిన కోరుట్ల ఎస్సై–31
1/1

ఏసీబీకి పట్టుబడిన కోరుట్ల ఎస్సై–3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement