ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన ట్రాక్టర్ యజమాని శివరాత్రి నర్సింలు అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాక్టర్‌ను మంగళవారం రాజన్నపేట శివారులో అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి, ఠాణాకు తరలించారు. ట్రాక్టర్ యజమాని నర్సింలు, డ్రైవర్ ఆలకుంట రాజులను అరెస్టు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.