గోదావరిఖని(రామగుండం): నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీలకమని రామగుండం పోలీస్‌కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. రామగుండం కమిషనరేట్‌కు శనివారం మూడు జాగిలాలు వచ్చినట్లు తెలిపారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ, నార్కోటిక్, ఎక్స్‌ప్లోజివ్ గుర్తింపులో పోలీస్ జాగిలాలు ఎంతో సహకరిస్తున్నాయన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్‌కి చెందిన మూడు జాగిలాలు శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తిచేసుకొని వచ్చాయన్నారు. అందులో గంజాయి, మత్తు పదార్థాల గుర్తింపులో నార్కోటిక్ డాగ్ (జెస్సీ), ఎక్స్‌ప్లోజివ్స్ గుర్తింపులో స్నైపర్ డాగ్ (రైడర్), పలురకాల నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ట్రాకర్‌డాగ్ వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్‌ఐలు వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సంపత్, పీసీ హరిశ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ శ్రీనివాస్