
హామీ నిలబెట్టుకున్న సర్కార్
కాల్వశ్రీరాంపూర్(రామగుండం): అసెంబ్లీ ఎన్నిక ల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫీ చేస్తూ తన మాట నిలబెట్టుకున్నారని పె ద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏకకాలంలో రుణమా ఫీతో జిల్లాలోని రైతులకు సుమారు రూ.2వేల కోట్ల వరకు లబ్ధిపొందుతారని తెలిపారు. కాంగ్రెస్ స ర్కార్ నిర్ణయంతో రాష్ట్రవ్యప్తంగా రైతులు పండుగ చేసుకుంటూ మురిసి పోతున్నారని అన్నారు. పదే ళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రై తులను మోసగించిందని విమర్శించారు. అనంత రం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే రైతుల కు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాజనవేన సదయ్య, మా జీ ఎంపీపీ సాయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక స దయ్య, ఎంపీటీసీ రావి సదానందం, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి పులి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.