
తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీ
పాలకుర్తి/రామగుండం: రామగుండం, అంతర్గాం, పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల పనితీరు, సిబ్బంది వివరాలు, వివిధ సమస్యలపై అధికారులకు అందించిన అర్జీలు, రికార్డు రూం తదితర అంశాలపై ఆరా తీశారు. మట్టి, ఇసుక అక్రమ తరలింపుపై నిఘా పెట్టాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పాలకుర్తి జెడ్పీ హైస్కూల్ సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కార్యాచరణతో విద్యాబోధన చేయాలని సూచించారు. రామగుండం, అంతర్గాం, పాలకుర్తి తహసీల్దార్లు, ఆర్‌ఐలు కుమారస్వామి, తిరుపతి, రామ్మోహన్‌రావు, శ్రీధర్, జ్యోతి, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.