
మాట్లాడుతున్న నాయకులు
గోదావరిఖని: సింగరేణి కార్మికుల మద్దతుతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రాజ్‌ఠాగూర్‌కు ఏఐటీయూసీ నాయకులు కె.స్వామి, ఆరెల్లి పోషం అభినందనలు తెలిపారు. సోమవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వెంటనే కార్మికుల సమస్యలపై దృష్టిసారించాలని కోరారు. క్వార్టర్లలో మార్బుల్ స్టోన్ వేయించాలని, కార్మికుల మారుపేర్లు మార్చాలన్నారు. శిథిలమైన క్వార్టర్ల స్థానంలో డబుల్ బెడ్‌రూంలతో కొత్తవి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కార్మికుల ఓట్లతో గెలుపొందిన నాయకులు సమస్యలు విస్మరించారని, అందుకే ఈసారి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇచ్చి, రెగ్యులరైజ్ చేయాలన్నారు. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకులు గౌతం గోవర్దన్, రంగు శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, సతీశ్‌బాబు, స్వామి, తిరుపతి, మల్లేశ్, రమేశ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.