
పోటీలను ప్రారంభిస్తున్న చైర్మన్ రమేశ్ రెడ్డి, నిర్వాహకులు
తిమ్మాపూర్(మానకొండూర్): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి, గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని తిమ్మాపూర్ శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి అన్నారు. సోమవారం కళాశాలలో మెగా స్పోర్ట్స్ మీట్ 2కే–23 ప్రారంభించి, మాట్లాడారు. వారం రోజులపాటు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటల ద్వారా పోటీతత్వం, ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నారు. జేతలకు సర్టిఫికెట్‌తోపాటు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. క్రికెట్, వాలీబాల్, రన్నింగ్, త్రోబాల్, కబడ్డీ, క్యారమ్స్, బ్యాడ్మింటన్, షార్ట్‌పుట్ క్రీడాంశాల్లో పోటీలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, నిర్వాహకులు శ్రీరామచంద్, వినయ్, ఏవో రామారావు, స్పోర్ట్స్ ఇన్‌చార్జి రమేశ్, హెచ్‌వోడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ రమేశ్ రెడ్డి
మెగా స్పోర్ట్స్ మీట్ 2కే–23 ప్రారంభం